2021 జ్ఞాపకాలుః రి-ఎంట్రీ బాట పట్టిన తారలు!
on Dec 20, 2021

2021 క్యాలెండర్ ఇయర్ లో పలువురు తారలు రి-ఎంట్రీ బాట పట్టారు. వారిలో కొందరు విజయాలు చూశారు కూడా. ఇంతకీ ఆ తారలెవరంటే..
Also Read:రష్మిక ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్!
పవన్ కళ్యాణ్ః
`అజ్ఞాతవాసి` (2018) తరువాత క్రియాశీలక రాజకీయాలపైన దృష్టి సారించిన అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది `వకీల్ సాబ్`తో రి-ఎంట్రీ బాట పట్టారు. బాలీవుడ్ కోర్ట్ డ్రామా `పింక్` (2016) ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అడ్వకేట్ కొణిదెల సత్యదేవ్ గా మెస్మరైజ్ చేశారు పవన్. తన ఖాతాలో ఓ మెమరబుల్ మూవీని వేసుకున్నారు.
శ్రుతి హాసన్ః
`కాటమ రాయుడు` (2017) అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్ళీ కనిపించని చెన్నై పొన్ను శ్రుతి హాసన్.. `క్రాక్`తో రి-ఎంట్రీ బాట పట్టారు. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆ సినిమా అనంతరం `వకీల్ సాబ్`లో అతిథి పాత్రలో అలరించారు. ఈ రెండు తెలుగు సినిమాల్లోనూ ఆమె గృహిణి పాత్రల్లోనే కనిపించడం విశేషం.
ప్రియమణిః
`మన ఊరి రామాయణం` (2016) తరువాత టాలీవుడ్ కి దూరమైన ప్రియమణి.. `నారప్ప`తో రి-ఎంట్రీ ఇచ్చారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన ఈ సినిమాలో సీనియర్ స్టార్ వెంకటేశ్ కి జంటగా కనిపించారు ప్రియ. వీక్షకాదరణ పొందిన ఈ సినిమాలో బిడ్డల తల్లి సుందరమ్మగా ఆకట్టుకున్నారు.
సయామీ ఖేర్:
తెలుగు చిత్రం `రేయ్` (2015)తో కథానాయికగా తొలి అడుగేసిన సయామీ ఖేర్.. ఆరేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం `వైల్డ్ డాగ్` కోసం ఓ ముఖ్య పాత్రలో దర్శనమిచ్చింది. తన అభినయంతో విమర్శకుల ప్రశంసలు పొందింది.
అను ఇమ్మాన్యుయేల్ః
`శైలజా రెడ్డి అల్లుడు` (2018) తరువాత కనుమరుగైన అను ఇమ్మాన్యుయేల్.. ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన `అల్లుడు అదుర్స్`తో రి-ఎంట్రీ ఇచ్చింది. ఆపై `మహా సముద్రం`లోనూ మెరిసింది. అయితే, ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన విజయం సాధించలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



