`ధమాకా`లో పాయల్ చిందులు.. భారీ పారితోషికం కూడా!
on Dec 20, 2021

సంచలన చిత్రం `ఆర్ ఎక్స్ 100`తో తెలుగునాట హీరోయిన్ గా డ్రీమ్ డెబ్యూ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. ఆపై `ఆర్.డి.ఎక్స్ లవ్`, `వెంకిమామ`, `డిస్కో రాజా` వంటి సినిమాల్లో నాయికగా సందడి చేసిన పాయల్.. ప్రస్తుతం మీడియం బడ్జెట్ మూవీస్ లో నటిస్తూనే ఓటీటీ వైపు దృష్టి సారించింది. వెబ్ - సిరీస్ ల్లోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది ఈ గ్లామరస్ యాక్ట్రస్.
ఇదిలా ఉంటే.. ఆ మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన `సీత` కోసం ``బుల్ రెడ్డి`` పాటలో ఐటమ్ గాళ్ అవతారమెత్తిన పాయల్ రాజ్ పుత్.. స్వల్ప విరామం అనంతరం మరో స్పెషల్ నంబర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే.. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా `నేను లోకల్` కెప్టెన్ త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో `ధమాకా` పేరుతో ఓ మాస్ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో `పెళ్ళి సందడి` ఫేమ్ శ్రీలీల నాయికగా నటిస్తోంది. కాగా, ఇందులో కథానుసారం ఓ ప్రత్యేక గీతం ఉందట. ఆ పాటలో పాయల్ మెరుస్తుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. భారీ పారితోషకం అందుకుని మరీ ఈ పాటలో చిందులేయబోతోందట పాయల్. త్వరలోనే `ధమాకా`లో పాయల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మరి.. `డిస్కో రాజా`లో రవితేజకి నాయికగా అచ్చిరాని పాయల్.. `ధమాకా`లో ఐటమ్ గాళ్ నైనా ప్లస్ అవుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



