యాక్సిడెంట్ కేసులో సాయితేజ్‌పై చార్జ్‌షీట్! డ్రైవింగ్ లెసెన్స్, ఆర్సీ సబ్మిట్ చేయలేదు!!
on Dec 28, 2021

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ సెప్టెంబర్ రెండో వారంలో హైదరాబాద్‌లోని రాయదుర్గం దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు అపోలో హాస్పిటల్‌లో చికిత్స తర్వాత డిశ్చార్జయి ఇంటికి వచ్చిన అతను విశ్రాంతి తీసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మరోసారి ఆ ఘటన వార్తల్లో నిలిచింది. ఆ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి ఇదివరకే నోటీసులు జారీ చేసిన పోలీసులు ఇప్పుడు అతనిపై చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని సైబరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఓ ప్రెస్‌మీట్‌లో పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
Also read: తెలుగునాట 75 శాతం రికవరీ అయిన 'పుష్ప'.. తెలంగాణలో ప్రాఫిట్స్ మొదలయ్యాయ్!
"సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనపై కేసు నమోదుచేసి, ఆయన కోలుకున్నాక 91 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చాం. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లకు సంబంధించిన వివరాలు అందజేయాల్సిందిగా కోరాం. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో త్వరలోనే సాయితేజ్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేయబోతున్నాం" అని ఆయన చెప్పారు.
Also read: తెలుగునాట 'అఖండ' లాభం 30 శాతం.. తెలంగాణలో మాత్రం 87 శాతం!
పోలీసులు అడిగినా ఇంతదాకా సాయితేజ్ సంబంధిత డాక్యుమెంట్లు ఎందుకు అందజేయలేదనే విషయం వెల్లడి కాలేదు. ఆయన వద్ద వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు లేవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆయన వాటిని సబ్మిట్ చేయకపోతే కేసును ఎదుర్కోక తప్పదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



