కర్ణాటకలో టీవీ షూటింగులకు ఓకే... అయితే?
on May 7, 2020
కర్ణాటక ప్రభుత్వం కన్నడ టీవీ షోస్, సీరియల్స్ షూటింగులకు అనుమతులు ఇచ్చింది. అయితే... వాళ్లు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే?
1) సెట్ లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. శానిటైజర్స్ ఉపయోగించాలి.
2) ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాలకు బఫెట్ సిస్టమ్ ఫాలో కావాలి. అనుచరుల చేత భోజనాలు సర్వ్ చేయించుకోకూడదు.
3) షూటింగుకు అవసరమైన, తప్పనిసరిగా కావాల్సిన సాంకేతిక నిపుణులు నటీనటులను మాత్రమే సెట్ లో ఉండాలి.
4) సెట్ లో వయోవృద్ధులకు అనుమతి లేదు. నో సీనియర్ సిటిజన్స్ అన్నమాట.
5) ఇండోర్ లో మాత్రమే షూటింగులు చేయాలి. అవుట్ డోర్ వెళ్ళకూడదు.
6) సెట్ లో అందరూ భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. అవసరమైతేనే పక్క వారితో మాట్లాడాలి.
సుమారు రెండు నెలలుగా కన్నడ టీవీ ఇండస్ట్రీలో షూటింగులు జరగడం లేదు. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అదే విధంగా తెలుగులోనూ అనుమతి ఇవ్వవలసినదిగా టీవీ ప్రతినిధులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కలిశారు. అయితే... ఆయన ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. ఈనెలాఖరు వరకు ఓపిక పట్టమని జూన్ లో షూటింగ్ ల గురించి మాట్లాడుకుందామని తెలియజేశారు.