అప్పుడే గరెట పట్టుకున్న సమంత..
on Nov 5, 2017
అక్కినేని వారి ఇంట కోడలుగా అడుగుపెట్టిన సమంత అప్పుడే వంటింట్లో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టినట్టు ఉంది. అప్పుడే వంట చేసి తన భర్తకు వండి పెడుతోంది. అంతేకాదు తాను చేసిన వంటకాల ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. దానికింద ఓ మెసేజు కూడా ఇచ్చింది. పదార్థాలను ఎక్కువసేపు ఉడికించకండి.. అలా అని మరీ తక్కువ సేపు ఉడకబెట్టకండి అంటూ. ఆ తరువాత తన వంట తిన్న తరువాత ఎవరికీ ఏమీ కాలేదని సరదాగా పేర్కొంది సమంత. మొత్తానికి సమంత ప్రస్తుతం సమంత రంగస్థలం షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.