కాసేపు ఉంటే.. కాపురం పోయేది!
on Nov 4, 2017
ఓ కథ చెబుతా వినండి. ఆయన ఓ సినిమా హీరో. తాను నటించిన ఓ సినిమలో హీరోయిన్ కి తన ఫోన్ నంబర్ చదివి వినిపిస్తాడు. ఎప్పుడైనా తెరమీద పర్సనల్ ఫోన్ నంబర్ చదువుతారా? చదవరు కదా! కానీ పిచ్చి జనాలు చదివేశాడు అనుకున్నారు. దురద్రష్టవశత్తూ ఆ హీరోగారికి మహిళాభిమానులు ఎక్కవ. దాంతో తెరమీద హీరోగారు చదివిన ఫోన్ నంబర్ నోట్ చేసుకొని ఆ నంబర్ కి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఒకటా? రెండా? వేల సంఖ్యలో ఫోన్లు ఆ నంబర్ కి వస్తున్నాయ్ కామెడీ ఏంటంటే.. ఆ నంబర్ ఓ సాధారణ ఆటో రిక్షావాలాది. అతను పాపం... కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. ప్రతి సారి అమ్మాయిలు ఫోన్లు చేసి ఐలవ్యూలు చెబుతుంటే.. కొత్తగా కాపురానికొచ్చిన పాపం ఆ అమ్మాయికి మండుకొచ్చింది. ‘నేను నీతో కాపురం చేయను.. నేను పోతా’ అంటూ సమాన్లు సర్దుకుంది. మనోడి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. ‘ఆ ఫోన్లు నాకు కాదు వస్తోంది’ అని చెప్పినా భార్య వినిపించుకోలేదు. నంబర్ మార్చేద్దామంటే.. తన ఖాతా దారులందరి దగ్గరా ఉంది అదే నంబర్. నంబర్ మారిస్తే సంపాదనకు దెబ్బ. కట్టుకున్న పెళ్లామేమో నిజం చెప్పినా నమ్మడం లేదు. ఏం చేద్దాం? చివరకు ఓ నిర్ణయానికి వచ్చేశాడు.
ఆ ఫోన్ ఆ అమ్మాయికే ఇచ్చేసి రెండ్రోజులు చూడమన్నాడు. ‘నిజమే.. ఈ ఫోన్లు ఆయనకు రావడం లేదు. ఎవరో సినిమా స్టార్ కి వస్తున్నాయ్’ అన్న విషయం ఆ అమ్మాయికి అవగతం అయ్యింది. కాపురం కుదురుకుంది. తనను ఇంతటి ఇబ్బందుల పాలు చేసిన ఆ హీరోని క్షమించకూడదని నిర్ణయించుకున్నాడు ఆటోవాలా. డైరెక్ట్ గా పోలీస్టేషన్ కి వెళ్లి కేసుపెట్టాడు. కోర్ట్ కెళ్లి సదరు హీరోగారిపై 50 వేల పౌడ్లు దావా వేశాడు. కానీ.. కోర్టు మాత్రం అతని నిర్ణయాన్ని నిరాకరించింది. ముందు అతను ఫోన్ ద్వారా నిజంగా ఇబ్బందుల పాలవుతున్నాడా? లేడా? అనే విషయంపై విచారణ జరిపించాల్సిందిగా పోలీసులకు ఆర్డర్ పాస్ చేసింది. విచారణలో నిజంగా ఫోన్ కారణంగా తాను ఇబ్బందులు ఎదుర్కొన్నాడని తేలితే.. సదరు హీరోగారపై 50 వేల పౌండ్లు దాదా ఖారారైనట్టే. ఇది విన్న తర్వాత ఇది కథ కాదు.. నిజంగా జరిగే ఉంటుంది.. అనే అనుమానం మీకు రావొచ్చు. నిజమే నిజంగానే జరిగింది. ఈ కామెడీ వివాదం బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. తెరమీర ఆటోవాలా నంబర్ చదివిన స్టార్ పేరు షాకిబ్ ఖాన్. బాధితుడి పేరు ఆటోడ్రైవర్ ఇలాజుల్ మియా. త్వరలో ఈ వ్యవహారం ఓ కొలిక్కి రానుంది. రీసెంట్ గా మన తెలుగు సినిమా ‘రాజా ది గ్రేట్’ విషయంలో కూడా అటుఇటుగా ఇలాంటి గొడవే జరిగింది. తెరపై రవితేజా పలికిన ఫోన్ నంబర్... విశాఖ వాసి లంకమల్లి గోపిని ముప్పుతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే.