Home

»

Latest News

ఫ‌స్ట్ చిరు.. నెక్స్ట్ వెంకీ..!

Dec 2, 2021 10:30AM

హిందీనాట తిరుగులేని మాస్ హీరోగా గుర్తింపు పొందారు కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్. అనువాదాల‌తో తెలుగువారికి కూడా సుప‌రిచితుడైన ఈ స్టార్ హీరో.. త్వ‌ర‌లో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. అది కూడా.. సీనియ‌ర్ స్టార్స్ చిత్రాల కోసం.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా `గాడ్ ఫాద‌ర్` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `లూసిఫ‌ర్` ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాని `హ‌నుమాన్ జంక్ష‌న్` ఫేమ్ మోహ‌న్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో స‌ల్మాన్ ఓ స్పెష‌ల్ రోల్ లో క‌నిపించ‌బోతున్నారు. తాజాగా ఈ విష‌యాన్ని స‌ల్మాన్ నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. త‌న స‌న్నిహితుల్లో ఒక‌రైన విక్ట‌రీ వెంక‌టేశ్ కాంబినేష‌న్ లోనూ స‌ల్మాన్ ఓ సినిమా కోసం క‌లిసి న‌టించ‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని కూడా `ద‌బాంగ్` స్టార్ నే వెల్లడించారు. అయితే.. అది ఏ సినిమా కోసం అనేది మాత్రం చెప్ప‌లేదు. ఏదేమైనా.. ఫ‌స్ట్ చిరు - నెక్స్ట్ వెంకీ అంటూ టాలీవుడ్ లో స‌ల్మాన్ సంద‌డి చేయ‌నుండ‌డం ఇక్క‌డి ఖాన్ అభిమానుల‌కు ఆనందాన్నిచ్చే విష‌య‌మే. సో.. 2022లో స‌ల్మాన్ బ్యాక్ టు బ్యాక్ తెలుగు చిత్రాలు రిలీజ‌య్యే అవ‌కాశ‌ముంద‌నే చెప్పాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com