Home

»

Latest News

`ఆచార్య‌`.. చ‌ర‌ణ్ పాత్ర తాలూకు ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

Dec 2, 2021 10:47AM

`మ‌గ‌ధీర‌`, `బ్రూస్ లీ`, `ఖైదీ నంబ‌ర్ 150` చిత్రాల్లో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. `ఆచార్య‌` కోసం నాలుగోసారి జ‌ట్టుక‌ట్టిన సంగతి తెలిసిందే. గ‌త మూడు చిత్రాల‌తో పోలిస్తే ఇందులో మ‌రింత స్క్రీన్ టైమ్ తో ఈ మెగా కాంబో వెండితెర‌పై వినోదాలు పంచ‌నుంది.

కాగా, ఈ చిత్రంలో సిద్ధ‌గా క‌నిపించ‌నున్న రామ్ చ‌ర‌ణ్ ఓవ‌రాల్ గా 40 నిమిషాల పాటు తెర‌పై ద‌ర్శ‌న‌మిస్తార‌ట‌. అంతేకాదు.. ద్వితీయార్ధంలో ఎంట‌ర్ అయ్యే ఈ పాత్ర దాదాపుగా సెకండాఫ్ మొత్తం క‌నిపిస్తుంద‌ట‌. రొమాన్స్, యాక్ష‌న్, కామెడీ.. ఇలా అన్ని కోణాల్లోనూ ఈ పాత్ర ఎంట‌ర్టైన్ చేస్తుంద‌ని స‌మాచారం. అలాగే.. ఆచార్య పాత్ర, సిద్ధ పాత్ర మ‌ధ్య సాగే స‌న్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయ‌ని అంటున్నారు. అదే విధంగా.. చిరు, చ‌ర‌ణ్ కాంబోలో వ‌చ్చే పాట కూడా విజువ‌ల్ ఫీస్ట్ గా ఉంటుంద‌ని స‌మాచారం. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, చిరంజీవి జంట‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్, చ‌ర‌ణ్ కి జోడీగా పూజా హెగ్డే న‌టించిన ఈ సినిమాలో సోనూ సూద్, ప్ర‌కాశ్ రాజ్, సంగీత ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. రెజీనా ఓ ప్ర‌త్యేక గీతంలో చిందుల‌తో క‌నువిందు చేయ‌నుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `ఆచార్య‌`  ఫిబ్ర‌వ‌రి 4న థియేట‌ర్స్ లోకి రానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com