Home

»

Latest News

విద్యా బాల‌న్ `ద డ‌ర్టీ పిక్చ‌ర్`కి ప‌దేళ్ళు!

Dec 2, 2021 10:21AM

ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టీమ‌ణుల్లో విద్యా బాల‌న్ ఒక‌రు. అలాంటి విద్య‌కి `ఉత్త‌మ న‌టి`గా జాతీయ పుర‌స్కారాన్ని అందించిన చిత్రంగా `ద డ‌ర్టీ పిక్చ‌ర్`కి ప్ర‌త్యేక స్థాన‌ముంది. గ్లామ‌ర్ క్వీన్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెర‌కెక్కించిన ఈ సినిమాలో రేష్మ‌గా విద్యా బాల‌న్ పెర్ఫార్మెన్స్ ప్రేక్ష‌కుల‌ను, విమ‌ర్శ‌కుల‌ను మెప్పించింది. మిల‌న్ లూథ్రియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ బ‌యోగ్రాఫిక‌ల్ మ్యూజిక‌ల్ డ్రామాలో న‌జీరుద్దీన్ షా, ఇమ్రాన్ హ‌ష్మి, తుషార్ క‌పూర్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో అల‌రించారు.

విశాల్ - శేఖ‌ర్ బాణీలు క‌ట్ట‌గా.. సందీప్ శిరోద్క‌ర్ నేప‌థ్య సంగీత‌మందించారు. పాట‌ల్లో ``ఉల్లాలా ఉల్లాలా`` (శ్రేయా ఘోష‌ల్, బ‌ప్పీల‌హ‌రి గానం) చార్ట్ బ‌స్ట‌ర్ గా నిలవ‌గా.. ``ఇష్క్ సూఫియానా``, ``ట్వింకిల్ ట్వింకిల్``, ``హ‌నీమూన్ కీ రాత్`` కూడా ఆక‌ట్టుకున్నాయి. బాలాజీ మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఏక్తా క‌పూర్, శోభా క‌పూర్ నిర్మించిన `ద డ‌ర్టీ పిక్చ‌ర్`.. `ఉత్త‌మ న‌టి`గా విద్య‌కి నేష‌న‌ల్ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో పాటు ప‌లు పురస్కారాల‌ను అందించింది. అలాగే, ప‌లు విభాగాల్లో అవార్డులు కైవ‌సం చేసుకుంది. 2011 డిసెంబ‌ర్ 2న సిల్మ్ స్మిత జ‌యంతి సంద‌ర్భంగా రిలీజై అఖండ విజ‌యం సాధించిన‌ `ద డ‌ర్టీ పిక్చ‌ర్`.. నేటితో 10 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com