ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కూతురే సలార్ శ్రియా రెడ్డి!
on Dec 26, 2023

ఇప్పుడు ఎక్కడ చూసినా సలార్ లో నటించిన శ్రియా రెడ్డి గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాలో రాధా రమ అనే క్యారెక్టర్లో ఆమె పండించిన రాజసం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. సలార్ విజయానికి సంబంధించి ప్రభాస్ కి ఎంత పేరు వచ్చిందో ఆ తర్వాత శ్రియా రెడ్డి కి కూడా అంతే పేరు వచ్చింది. ఇప్పుడు ఈమె ఎవరనే చర్చ అందరిలోను వస్తుంది.
శ్రియా రెడ్డి చెన్నై లో సెటిల్ అయిన ఒక తెలుగు కుటుంబానికి చెందినది. ఆమె నాన్న పేరు భరత్ రెడ్డి. ఆయన 1978 - 81 మధ్య కాలంలో భారత క్రికెట్ జట్టు తరుపున అనేక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రియా రెడ్డి గురించి వెతుకుతున్న వాళ్ళందరు ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్రముఖ క్రికెటర్లు దినేష్ కార్తీక్, లక్ష్మీపతి బాలాజీ లు క్రికెట్ లో అత్యున్నత స్థాయికి ఎదిగేలా భరత్ రెడ్డి నే శిక్షణ ఇచ్చాడు.
అలాగే శ్రియా రెడ్డి ప్రముఖ నటుడు విశాల్ కి స్వయానా వదిన అవుతుంది. విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణ, శ్రియా రెడ్డి లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రియా రెడ్డి విశాల్ హీరోగా 2006 లో వచ్చిన పొగరు మూవీ లో విశాల్ ని ఇష్టపడి ఆ తర్వాత విశాల్ మీద పగ తీర్చుకునే లేడీ విలన్ క్యారక్టర్ లో సూపర్ గా నటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



