‘వకీల్‌సాబ్2’ చేసేందుకు పవన్‌కు ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు!
on Dec 26, 2023
పవన్‌కల్యాణ్ కెరీర్‌లో ‘వకీల్‌సాబ్’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. మొదటిసారి నల్లకోటు వేసుకొని అడ్వకేట్‌గా నటించిన పవన్‌కళ్యాణ్ ఆ పాత్రకు వన్నె తెచ్చారు. సినిమాలోని కోర్టు సీన్స్‌లో ప్రకాష్‌రాజ్‌తో తలపడే సన్నివేశాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. కరోనా నుంచి దేశం కోలుకుంటున్న సమయంలో, ఎపిలో టికెట్స్ రేట్ల నియంత్రణను తట్టుకొని మరీ విజయం సాధించడం పవర్‌స్టార్ ఫాన్స్‌కి మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘వకీల్‌సాబ్ 2’ చిత్రాన్ని చేస్తారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే సీక్వెల్ చేయదగ్గ కథ అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత దిల్‌రాజు బేనర్‌లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ నితిన్‌తో చేసే పనిలో బిజీ అయిపోయాడు వేణుశ్రీరామ్.
ఇదిలా ఉండగా.. వకీల్‌సాబ్ సీక్వెల్ చేసేందుకు సరిపోయే కథతో మలయాళంలో ఇటీవల ఓ సినిమా విడుదలైంది. ‘దృశ్యం’ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోహన్‌లాల్ హీరో. ‘నెరు’ పేరుతో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 21న విడుదలై సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. సలార్ పోటీని తట్టుకొని ఈ సినిమా నిలబడిరది. ఈ సినిమా చేసేందుకు వెంకటేష్ ఆసక్తి కనబరుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది పవన్‌కల్యాణ్‌కి బాగా సూట్ అవుతుందని సినిమా చూసినవారు చెబుతున్నారు. పైగా ఇది వకీల్‌సాబ్ సీక్వెల్‌కి కరెక్ట్‌గా సరిపోతుందంటున్నారు. కళ్ళు లేని ఒక మధ్య తరగతి యువతిని మంత్రి కొడుకు రేప్ చేస్తే.. ఆ కేసులో ఆ అమ్మాయి తరఫున న్యాయ పోరాటం చేసి ఆమెను ఎలా గెలిపించాడనేదే కథ. కేవలం రెండు ఇళ్ళు, కోర్టు రూమ్ సెటప్‌లోనే రెండున్నర గంటలపాటు ఎలాంటి బోర్ లేకుండా జీతూ జోసెఫ్ సినిమాను నడిపించాడు. ప్రొడక్షన్ పరంగా ఎలాంటి ఖర్చులేని ఈ సినిమా షూటింగ్‌ని కూడా ఎంతో వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని పవన్ భావిస్తే ఇది మంచి సబ్జెక్ట్ అవుతుంది. మరి ఈ సినిమా విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటారో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
