సాయితేజ్, రాశీ ఖన్నా ఆటా పాటా!
on Nov 23, 2019

సుప్రీం హీరో సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా రెండోసారి నటిస్తోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. జీఏ2యువీ బేనర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. లేటెస్టుగా సాయితేజ్, రాశీ ఖన్న జోడీపై అన్నపూర్ణా స్టూడియోస్‌లో వేసిన అందమైన సెట్లో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్‌ను ఒక కలర్ ప్యాట్రన్‌లో ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రూపకల్పన చేశారు. తమన్ సంగీతమంచిన ఈ ఎనెర్జిటిక్ సాంగ్‌కు శ్రీజో సాహిత్యం, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు.. ప్రతి ఒక్కరు హాయిగా ఎంజాయ్ చేసే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారని, సాయితేజ్‌ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్‌లో చూపించబోతున్నారనీ నిర్మాత బన్నీ వాస్ చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్‌గా చిత్రీకరించారని ఆయన తెలిపారు. సత్యరాజ్, విజయ కుమార్, రావు రమేష్, మురళీశర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తారాగణమైన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జయ కుమార్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు, కో ప్రొడ్యూసర్: ఎస్.కె.ఎన్., రచన, దర్శకత్వం: మారుతి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



