సాయిథరమ్ తేజ్ ఇప్పట్లో పెళ్లి చేసుకోడట..?
on Mar 1, 2017
రూపం, మాటతీరు, నటన అన్నిట్లో అచ్చుగుద్దినట్లు మావయ్యలను పోలి ఉంటాడు సాయిథరమ్ తేజ్. తనమార్క్ నటనతో..వరుస విజయాలతో సినిమా మీద సినిమా చేస్తూ దూసుకెళ్తున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో సాయిథరమ్ తేజ్ కూడా ఒకడు..దీంతో శుభకార్యాలకు వెళ్లినప్పుడు కాని..లేదంటే తన సినిమా ఫంక్షన్లకు అటెండ్ అయినప్పుడు అక్కడ ఉన్న వారు ఏంటీ సాయి పప్పన్నం ఎప్పుడు అని అడుగుతున్నారట..ఇదే మాటను మీడియా మిత్రులు కూడా అడుగుతుండటంతో కాస్త చిరాకు పడుతున్నాడట సాయి.
అయితే ఇలాంటి ప్రశ్నలు విని విని విసిగిపోయాడో..లేదంటే మరేదైనా కారణమో తెలియదు కాని తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని తేల్చిచెప్పేశాడు. రీసెంట్‌గా విన్నర్ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సాయి ఈ విధంగా అన్నాడట. తన కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలవుతుందని..ఆర్థికంగా కాస్త నిలదొక్కుకుంటున్నానని..నా పేరేంట్స్‌ని బాగా చూసుకోవాలనుకుంటున్నానని..దానికి తోడు ప్రజంట్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నానని అందువల్ల పెళ్లికి తొందర లేదని అన్నాడట..