సచిన్ : టీజర్ రివ్యూ
on Apr 14, 2016
క్రికెట్ ఒక మతమైతే, సచిన్ ఆ మతానికి దేవుడు..ఇదీ భారత క్రికెట్ లవర్ల మదిలో సచిన్ కు ఉండే స్థానం. అందుకే సచిన్ లైఫ్ స్టోరీ మంచి బయోపిక్ కు మెటీరియల్ గా మారింది. కోటానుకోట్ల మంది ఆరాధించే క్రికెట్ దేవుడి కథను తెరపై ఆవిష్కరిస్తే, కాసులు కురవడం కన్ఫామ్. అందుకే సచిన్ పేరుతో ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎ బిలియన్ డ్రీమ్స్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే క్రికెట్ లో ధోనీ, అజార్ బయోపిక్ లు వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నాయి. ఇప్పుడు సచిన్ సినిమా కూడా వీటి తరహాలో రాబోతోంది. జేమ్స్ ఎర్స్ కిన్ డైరెక్షన్లో, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన సచిన్ సినిమా టీజర్ ఈ రోజు రిలీజైంది. టెండూల్కర్ బ్యాగ్రౌండ్ వాయిస్ తో సాగే ఆ టీజర్ ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
