రాశీఖన్నాను ఎవరూ పట్టించుకోలేదట..!
on Apr 14, 2016
రాశీఖన్నా. టాలీవుడ్ లో డైరీ ఫుల్ అయిపోయిన హీరోయిన్లలో రాశి కూడా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న రాశి, బెంగాల్ టైగర్ తో గ్లామరస్ గా కూడా పేరు సంపాదించుకుంది. హీరోయిన్లు తగ్గిపోవడంతో, కుర్రహీరోలంతా రాశికే ఓటేస్తున్నారు. సన్నటి నడుము, సరైన శరీరాకృతిలో యూత్ లో యమ క్రేజ్ సంపాదించేసుకుందీ పాప. కానీ తనకు సంబంధించిన ఒక గత విషయాన్ని చెప్పి అందర్నీ షాక్ కు గురిచేసింది.
రాశీ ఖన్నా నచ్చని కుర్రాళ్లు రెండు తెలుగురాష్ట్రాల్లోనూ దాదాపు ఉండరేమో. బొద్దుగా ఉంటుంది కాబట్టి, కోలీవుడ్ లో ట్రై చేస్తే అక్కడ కూడా ఇదే రకం ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ ఆ అమ్మడు మాత్రం, తననెవరూ కనీసం కన్నెత్తి చూసేవారు కూడాకాదంటూ చెబుతోంది. అది ఇప్పుడు కాదు లెండి. గతంలో ఒకప్పుడు మనం ఊహించుకోలేనంత బొద్దుగా ఉండేదట రాశి. దాంతో లైన్ వెయ్యడం, లవ్ లెటర్స్ రాయడం పక్కన పెట్టి, కనీసం ఎవరూ చూసేవారు కూడా కాదట. మరి అలాంటి సాలిడ్ పెర్సనాలిటీ, ఇంతలా ఎలా మారిపోగలిగావు అంటే, గ్లామర్ ఫీల్డ్ లో ఉండాలంటే కొద్దిగా సన్నబడక తప్పదు కదా అంటూ సెలవిస్తోందీ సిమ్లా యాపిల్. ప్రస్తుతం ఈ భామ గోపీ చంద్ ఆక్సిజన్, సాయి థరమ్ సుప్రీం, రవితేజ కొత్త సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ బిజీబిజీగా ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
