`RRR`కు హీరోయిన్స్ ఖరారైనట్టే!!!
on Jan 30, 2019
ప్రజేంట్ దర్శకధీరుడు రాజమౌళి , ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో `ఆర్ఆర్ఆర్` వర్కింగ్ టైటిల్ తో భారీ మల్టీ స్టారర్ మూవీని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైన ఈ సినిమా రెండో షెడ్యూల్ నడుస్తోంది. ఇప్పటికే `ఆర్ఆర్ఆర్` సినిమాలో ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్స్ ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అనేక మంది పేర్లు బయటికి వచ్చాయి. అందులో సమంత , పరిణీతి చోప్రా , కీర్తి సురేష్ , అదితిరావు హైదరి పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆలియా భట్ పేరు ప్రచారం జరుగుతోంది. ఇందులో మరో హీరోయిన్ పాత్ర కోసం కియారా అడ్వాణీని అనుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోలుగా ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ బందిపోటు పాత్రలో నటిస్తే, రామ్ చరణ్ అతన్ని పట్టుకునే పోలీష్ అధికారి పాత్రలో యాక్ట్ చేస్తున్నట్టు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు `రామ్ రావణ రాజ్యం` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 2020 సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
