తమన్నా... ఏమన్నా న్యాయమా!!!
on Jan 30, 2019
తమన్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే. తెలుగులో నటించిన తొలి సినిమా శ్రీ నుంచి ఇప్పటి వరకు అమ్మడు ఫుల్లుగా అందాలనే నమ్ముకుని కెరీర్ లాగేస్తుంది.కెరీర్ మొదలుపెట్టి 13 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుందంటే దానికి కారణం కూడా అమ్మడి అందాలే. చిన్నా పెద్దా హీరోలు అనే తేడా లేకుండా అందరికీ సామాజిక న్యాయం చేస్తుంది తమన్నా. ఈ మధ్య విడుదలైన ఎఫ్2 సినిమాలో కూడా ఫుల్లుగా అందాలు ఆరబోసింది. ఓ అడుగు ముందుకేసి ఏకంగా బికినీ కూడా వేసి సేగలు పుట్టించింది తమన్నా. ఇక ఇప్పుడు ఇలాంటి మిల్కీ బ్యూటీ ఓ సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. అమ్మడు ఇక నుంచి అందాల ఆరబోతకు దూరంగా ఉంటానని చెప్తుంది. ఇది విని ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. తమన్నా ఏంటి గ్లామర్ షోకు దూరంగా ఉండటం ఏంటి అని షాక్ అవుతున్నారు వాళ్లు. కెరీర్ మొదట్లో కొన్ని రోజులు మాత్రమే ఇలా గ్లామర్ షో చేయలేదు తమన్నా. కానీ బద్రీనాథ్ సినిమా నుంచి ఎక్స్ పోజింగ్ కు కొత్త అర్థాన్ని చెప్పింది ఈ పాలరాతి బొమ్మ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతీ సినిమాలో రెచ్చిపోతూనే ఉంది. ఇలాంటి తమన్నా ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంది.
ఇక పై అందాలు కాకుండా అభినయాన్ని నమ్ముకుంటానంటుంది. ఇన్నాళ్లూ కెరీర్ కోసం అందాలన్నీ ఆరబోసాను. ఇక చాలు నటనను నమ్ముకుని ఛాన్సులు దక్కించుకుంటానంటుంది మిల్కీ బ్యూటీ. తమన్నా నిర్ణయంతో దర్శక, నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సైరాతో పాటు, క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మి సినిమాలో నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లోనే నటిస్తుంది తమన్నా. అయితే అందాలు ఆరబోయకుండా ఇండస్ట్రీలో ఉండటం చాలా కష్టం. మరి ఈ విషయంలో తమన్నా ఎంతకాలం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ విషయం తెలిసిన కుర్రాళ్లు మాత్రం తమన్నా ఏమన్నా నీకిది న్యాయామా అని ప్రశ్నిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
