మహానాయకుడికి మరిన్ని సమస్యలు?
on Jan 30, 2019
ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు మరిన్ని సమస్యలు ఎదురవుతాయా? అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తవుతుందా? అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయగలుగుతారా? ఫిలింనగర్ సర్కిళ్లలో బోలెడన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం కథానాయకుడు చిత్రానికి ఆశించిన వసూళ్లు రాలేదు. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మాత్రం టాక్ వచ్చింది. ఈ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని.. రెండో భాగం మహా నాయకుడు చిత్రంలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ సజావుగా సాగడం లేదని టాక్. అనుకున్నట్టు షెడ్యూళ్లు ముందుకు సాగడం లేదట. తొలి భాగం నిరాశపరచడంతో బాలకృష్ణ కొంచెం చికాకుగా ఉన్నారట. అందువల్ల, మహా నాయకుడు చిత్రీకరణ ఆలస్యం అవుతోంది. ఈ కారణంగా విడుదల కూడా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తొలుత ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి తొలి వారంలో విడుదల చేయాలనుకున్నారు. తర్వాత ఫిబ్రవరి రెండో వారం 15వ తేదీకి మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 15న విడుదల కావడం కూడా అనుమానమే. ఫిబ్రవరి 22న విడుదల చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. 22 కు రావాలంటే మరో చిక్కు ఉంది. మార్చిలో ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుంది. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ కు రాజకీయ నాయకులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. విడుదలపై స్టే విధించే అవకాశాలు లేకపోలేదు. చూస్తుంటే.. సినిమాను చాలా సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
