Home

»

Latest News

లెజెండ్రీ హీరో రిషీకపూర్! తొలి సినిమాతోనే అవార్డులు!

Apr 30, 2020 2:01PM

నిన్నటి తరం లెజెండ్రీ హీరో రిషీకపూర్ రెండున్నర దశాబ్దాలుగా బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోగా రాణించారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఘనత ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన జీవిత ప్రస్థానం విషయానికి వస్తే 1952, సెప్టెంబర్‌ 4న ముంబైలో జన్మించిన రిషీకపూర్‌ మేరా నామ్‌ జోకర్ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆయన బాబీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఆయన ఆ సినిమాతో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ , సర్గమ్‌, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్‌, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి.
నటుడుగానే కాకుండా దర్శక, నిర్మాతగా రాణించిన ఆయన పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com