నేనెవరికీ క్షమాపణలు చెప్పడం లేదు!
on Oct 8, 2020
పాయల్ ఘోష్ మీద రూ. 1.1 కోట్లకు రిచా చద్దా పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. కోర్టులో కేసు విచారణకు వచ్చింది. తన క్లయింట్ క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పాయల్ తరపు
లాయర్ కోర్టుకు విన్నవించిన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, తాను ఎవరికీ క్షమాపణలు చెప్పడం లేదని పాయల్ ఘోష్ ట్వీట్ చేశారు.
దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని, తనపై అత్యాచారం చేయబోయాడని ఆయిల్ ఘోష న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడంతో గొడవ మొదలైంది. ఆ ఇంటర్వ్యూలో రిచా చద్దాకు
అవకాశాలు రావడానికి కారణం అనురాగ్ కశ్యప్ తో సన్నిహితంగా ఉండడమేనని అతను చెప్పినట్లు పాయల్ చెప్పుకొచ్చారు. అనురాగ్ కి, పాయల్ కి మధ్య గొడవలు పాయల్ తనను లాగడం ఏమిటని రిచా
చద్దా ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు కేసు వేశారు. దీనిపై పాయల్ ట్వీట్లు చేశారు.
"రిచా చద్దాతో నాకు ఎటువంటి గొడవలు లేవు. మహిళలుగా ఒకరికి ఒకరు అండగా నిలబడాలనేది నా అభిమతం. ఈ విషయంలో ఆమెకు గాని, నాకు గాని అనుకోకుండా నేను ఎటువంటి హానీ జరగకూడదని
అనుకుంటున్నాను. నా పోరాటం అనురాగ్ కశ్యప్ కి వ్యతిరేకంగానే! ప్రపంచానికి అతడి నిజస్వరూపం చూపించాలనే. దానిపైనే దృష్టి పెడతాను" అని పాయల్ ఘోష్ తొలుత ఒక ట్వీట్ చేశారు. గంట తర్వాత
మరో ట్వీట్ చేశారు. అందులో మొదటి ట్వీట్ ని కోట్ చేస్తూ "నేను ఎవరికీ క్షమాపణలు చెప్పడం లేదు. నేను ఏది తప్పుగా మాట్లాడలేదు. రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. నాకు అనురాగ్ కశ్యప్ ఏమి చెప్పాడో అదే
చెప్పాను. సారీ నాట్ సారీ" అని అని పాయల్ పేర్కొన్నారు.