రేణు దేశాయ్ దర్శకత్వంలో మ్యూజికల్ వీడియో
on Feb 26, 2020
రేణు దేశాయ్ పేరు చెబితే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు రైతు సమస్యలకు సంబంధించిన టీవీ కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ తో ముడిపెడుతూ రాసిన పుకార్లను ఖండిస్తూ వచ్చే వివరణలు... ఇవే గుర్తొస్తున్నాయి. గతంలో రేణు దేశాయ్ కథానాయికగా నటించారు. తర్వాత మరాఠీలో ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. తెలుగులో రైతు సమస్యల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కిస్తానని కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అంతకంటే ముందే ఆమె ఒక మ్యూజికల్ వీడియో కి డైరెక్షన్ చేయనున్నారు.
రైతు సమస్యల నేపథ్యంలో కార్యక్రమం చేస్తున్న సమయంలో రేణుదేశాయ్ కి తెలుగు ర్యాపర్, సింగర్ రోల్ రైడ పరిచయం అయ్యారు. అతడు తన తమ్ముడు వంటి వాడని ఆమె రెండు మూడు సందర్భాలలో అన్నారు. ఇప్పుడు రోల్ రైడ పాటకు రేణు దేశాయ్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల 'అల... వైకుంఠపురములో' చిత్రంలో 'ఓ మై గాడ్ డాడీ' పాటను రోల్ రైడ పాడాడు. అంతకుముందు అమ్మాయిలు వచ్చిన సమస్య లేకుండా అతను పాడిన పాటలు యూట్యూబ్ లో విశేషమైన ఆదరణ లభించింది.