చిరంజీవి152కి మహేష్ డేట్స్ ఇచ్చేశాడు
on Feb 26, 2020
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152 సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. కథ, కథలో తన క్యారెక్టర్ ను మహేష్ ఆల్రెడీ విన్నారు. దర్శక, నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఈ సినిమాకి మహేష్ డేట్స్ కూడా కేటాయించారు. మే బుధవారం నుండి లేదంటే జూన్ మొదటి వారం నుండి షూటింగ్ చేస్తానని చెప్పారట. అంతకుముందు పరశురామ్ దర్శకత్వంలో ఆయన సోలో హీరోగా నటించిన సినిమా షెడ్యూల్ ఒకటి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిరంజీవి152లో చిరంజీవి మావోయిస్టు పాత్రలో నటిస్తుండగా... మహేష్ బాబు విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. సుమారు 25 నుండి 30 నిమిషాల నిడివిగల పాత్రలో మహేష్ కనిపించనున్నారు. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేశారు. అతడి దర్శకత్వ శైలి, ప్రతిభపై ఆయనకు చాలా నమ్మకం ఉంది. అందువల్ల, పాత్ర నిడివి తక్కువే అయినా తెరపై ప్రభావవంతంగా చూపించగలరు అనే నమ్మకంతో ఈ సినిమాకు తన అంగీకారం తెలిపారని సమాచారం.
Also Read