బాలకృష్ణ ఆట స్టార్ట్ చేసేది హైదరాబాద్‌లోనే
on Feb 26, 2020
కథ రెడీ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించబోయే మూడో సినిమాది. కథానాయిక కూడా రెడీ... 'డిక్టేటర్' తర్వాత మరోసారి బాలకృష్ణ సరసన తెలుగమ్మాయి అంజలి కథానాయికగా నటించనున్నది. కెమెరాలు, ఇతర సరంజామా కూడా రెడీ... ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు దర్శకుడి నుండి పిలుపు అందగానే రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు. లొకేషన్ కూడా రెడీ... షూటింగు స్టార్ట్ చేయడానికి. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా 'సింహా', 'లెజెండ్' వంటి ఘన విజయాల తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను మూడో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. వారణాసిలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అవేవీ నిజం కాదు. హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. మార్చిలో సుమారు 15 రోజులు షూటింగ్ చేస్తారట. ఆ తర్వాత వారణాసి వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ సినిమా బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు టాక్. అందులో ఒకటి అఘోరల మధ్య పెరిగే పాత్ర. దానికి సంబంధించిన సన్నివేశాలను వారణాసిలో షూట్ చేయనున్నారు.