రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఖరారైనట్టే!!
on Jul 13, 2019
రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఇటీవల బిగ్ బిస్ 3 కంటెస్టెంట్ చేయబోతుందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. వాటన్నింటికి చెక్ పెట్టింది రేణు దేశాయ్. `కంటెస్ట్ చేయడం కంటే ఆ షోను నేను హోస్ట్ చేయడాన్ని చాలా ఇష్టపడతాను అంటూ చెప్పుకొచ్చింది రేణు. దీంతో ఆమె బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ చేయట్లేదని క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే ఆమె సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక సారి ఆ వివరాల్లోకి వెళితే...బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందనున్న `టైగర్ నాగేశ్వరరావు` బయోపిక్ కోసం రేణు దేశాయ్ ని ఒక క్యారక్టర్ కోసం అనుకున్నారట. అయితే ఆమెను సంప్రదించడం కూడా జరిగిందట. ఈ విషయాన్ని ఈ చిత్రానికి రైటర్ గా చేస్తోన్న సాయి మాధవ్ బుర్రా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. దీంతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ దాదాపు ఖరారైనట్లే అని అర్థమవుతోంది. దొంగాట ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్ర యూనిట్ ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
