'సాహో' రూటులో 'సైరా'?
on Jul 15, 2019
'సాహో' సంగీతం విషయంలో బాలీవుడ్ స్టైల్‌ను ఫాలో అవుతోంది ప్రభాస్ యూనిట్. సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఒక సంగీత దర్శకుడు (జిబ్రాన్) చేత చేయిస్తున్నారు. ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడి చేతిలో పెట్టారు. పాటలన్నీ హిందీ సంగీత దర్శకులే చేశారని సమాచారం. సంగీతం విషయంలో 'సైరా నరసింహారెడ్డి' టీమ్ 'సాహో' రూటులోనే వెళుతున్నట్టుంది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చారిత్రిక చిత్రానికి హిందీ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు అందిస్తున్నారు. నేపథ్య సంగీతానికి కూడా హిందీ సంగీత దర్శకుణ్ణి తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ చిత్రాలు 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'కిక్', 'భజరంగీ భాయిజాన్', లేటెస్ట్ 'భారత్' తదితర చిత్రాలకు నేపథ్య సంగీతం అందించిన జూలియస్ పేకియమ్‌ను 'సైరా' నేపథ్య సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతోన్న రెండు భారీ బడ్జెట్ సినిమాల సంగీత బాధ్యతలు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల చేతిలో ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
