వరుస చిత్రాలతో రెజీనా సందడి!
on Jan 6, 2022

అటు గ్లామర్ రోల్స్ లోనూ.. ఇటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ లోనూ కనువిందు చేసే నాయికల్లో చెన్నై పొన్ను రెజీనా ఒకరు. `కొత్త జంట`, `పవర్`, `పిల్లా నువ్వు లేని జీవితం`, `సుబ్రమణ్యం ఫర్ సేల్`, `జ్యో అచ్యుతానంద`, `ఎవరు` వంటి విజయవంతమైన చిత్రాల్లో అలరించిన రెజీనా.. టాలీవుడ్ లో కనిపించి రెండేళ్ళు దాటింది. అయితే, మధ్యలో అనువాదాల్లో మెరిసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఈ ఏడాది మాత్రం వరుస సినిమాల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది.
ఆ వివరాల్లోకి వెళితే.. రానా దగ్గుబాటితో జట్టుకట్టిన పిరియడ్ డ్రామా `1945` ఈ నెలలో విడుదలకు సిద్ధమవగా.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటించిన `ఆచార్య`లో ``శానా కష్టం`` అంటూ ఐటమ్ సాంగ్ లో చిందేసిన రెజీనా ఫిబ్రవరి 4న సదరు సోషల్ డ్రామాతో ఎంటర్టైన్ చేయనుంది. ఇక నివేదా థామస్ తో కలిసి నటించిన ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ `శాకిని డాకిని` కూడా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో రిలీజయ్యే అవకాశముందంటున్నారు. అలాగే బైలింగ్వల్ మూవీ `నేనే నా` (తమిళంలో `శూర్పణగై`) కూడా సమ్మర్ స్పెషల్ గా విడుదల కావొచ్చని టాక్. మొత్తమ్మీద.. తక్కువ గ్యాప్ లో వరుస సినిమాలతో సందడి చేయబోతోందన్నమాట రెజీనా. మరి.. ఈ చిత్రాలు రెజీనా కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



