అమాయకురాలిగా రష్మిక!
on Jan 6, 2022

రోల్ సీరియస్ అయినా - కామిక్ అయినా, లుక్ గ్లామరస్ అయినా.. డి-గ్లామరస్ అయినా సిల్వర్ స్క్రీన్ పై ఇట్టే మెస్మరైజ్ చేస్తుంది నేషనల్ క్రష్ రష్మికా మందన్న. అందుకే.. అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక అభిమానగణాన్ని సొంతం చేసుకుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. రీసెంట్ గా `పుష్ప - ద రైజ్`తో ఫస్ట్ పాన్ - ఇండియా హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. త్వరలో ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Also Read: శ్రుతి హాసన్ కి అతనితోనే ఫస్ట్ హ్యాట్రిక్ రాసి పెట్టి ఉందా!
`చి ల సౌ`, `మన్మథుడు 2` చిత్రాలతో దర్శకుడిగానూ పలకరించిన నటుడు రాహుల్ రవీంద్రన్.. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ కోసం తీయనున్న ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో రష్మిక ఓ అమాయకురాలి పాత్రలో కనిపిస్తుందట. అంతేకాదు.. ఇప్పటివరకు తను పోషించిన పాత్రలకు భిన్నంగా ఈ క్యారెక్టర్ ఉంటుందని అంటున్నారు. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం రష్మిక చేతిలో `ఆడవాళ్ళు మీకు జోహార్లు`, `పుష్ప - ద రూల్` వంటి టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరోవైపు హిందీలో `మిషన్ మజ్ను`, `గుడ్ బై` సినిమాలు చేస్తోంది ఈ సెన్సేషనల్ హీరోయిన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



