పొంగల్ హ్యాట్రిక్ దిశగా అనూప్!
on Jan 6, 2022

2022 సంక్రాంతికి సందడి చేయనున్న చిత్రాల్లో `బంగార్రాజు` ఒకటి. కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో రూపొందిన ఈ మల్టిస్టారర్.. పొంగల్ స్పెషల్ గా జనవరి 14న థియేటర్స్ లోకి రానుంది. 2016 నాటి `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగ్ కి జంటగా రమ్యకృష్ణ కనిపించనుండగా.. చైతూకి జోడీగా `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి దర్శనమివ్వనుంది. కళ్యాణ్ కృష్ణ తీర్చిదిద్దిన ఈ చిత్రానికి టాలెంటెడ్ కంపోజర్ అనూప్ రూబెన్స్ బాణీలు అందించారు.
ఇదిలా ఉంటే.. గతంలో అనూప్ రూబెన్స్ కి సంక్రాంతి సీజన్ లో రెండు విజయాలున్నాయి. అవి కూడా బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్ లో దక్కడం విశేషం. 2015లో విక్టరీ వెంకటేశ్ - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన `గోపాల గోపాల` అనూప్ కి ఫస్ట్ పొంగల్ రిలీజ్ కాగా.. ఆపై ఏడాది తరువాత నాగార్జున ద్విపాత్రాభినయంలో `సోగ్గాడే చిన్ని నాయనా` వచ్చింది. ఈ రెండు సంక్రాంతి చిత్రాలు కూడా సక్సెస్ కావడమే కాకుండా.. అనూప్ కి స్వరకర్తగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి.
మరి.. ఆరేళ్ళ తరువాత మరోసారి ముగ్గుల పండక్కి వస్తున్న అనూప్ రూబెన్స్ కి.. పొంగల్ సీజన్ లో మూడో విజయంగా `బంగార్రాజు` నిలిచి హ్యాట్రిక్ అందిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



