ధనుష్ 'వడ చెన్నై' ఆఫర్‌ను వదులుకున్న రవితేజ!
on May 15, 2021
వెట్రిమారన్ డైరెక్షన్లో వచ్చిన సూపర్‌హిట్ గ్యాంగ్‌స్టర్ మూవీ 'వడ చెన్నై'లో ధనుష్ హీరోగా నటించాడు. ఆ మూవీలో కిశోర్, ఆండ్రియా జెర్మియా, సముద్రకని, అమీర్ కీలక పాత్రధారులు. మంచి టీమ్ వర్క్‌తో 'వడ చెన్నై' ఔట్‌స్టాండింగ్ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో అమీర్ పోషించిన రాజన్ క్యారెక్టర్‌ను మొదట విజయ్ సేతుపతికీ, తర్వాత రవితేజకూ వెట్రిమారన్ ఆఫర్ చేశాడనే విషయం మీకు తెలుసా? ఇటీవల క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు వెట్రిమారన్.
తన యూట్యూబ్ చానల్ కోసం వెట్రిమారన్‌ను ఇంటర్వ్యూ చేశాడు అశ్విన్. ఆ సందర్భంగా 'వడ చెన్నై' మూవీ ప్రస్తావన రాగా, రాజన్ రోల్‌కు మొదట విజయ్ సేతుపతి, రవితేజలను సంప్రదించిన విషయాన్ని తెలిపాడు వెట్రిమారన్. "వడ చెన్నైలో రాజన్ రోల్‌ను విజయ్ సేతుపతి చేయాల్సింది. అతనికి స్క్రిప్ట్ నచ్చింది. ఆ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడు కూడా. అయితే ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్ అతని మిగతా కమిట్మెంట్స్తో క్లాష్ అయింది. ఆ తర్వాత రవితేజను అప్రోచ్ అయ్యాను. అప్పుడాయన పాండిచ్చేరిలో తన సినిమా షూటింగ్లో ఉన్నారు. ఆయనను కలిశాను. కథ నచ్చింది. కానీ తన షెడ్యూల్ బాగా బిజీగా ఉండటం వల్ల ఆయన కూడా దాన్ని చేయలేకపోయాడు." అని చెప్పుకొచ్చాడు
షూటింగ్‌కు వెళ్లడానికి కొద్ది రోజుల ముందు ఆ రోల్‌కు అమీర్ న్యాయం చేయగలడని వెట్రిమారన్, ఆయన టీమ్ భావించింది. "నేను అమీర్‌ను కలిశాను. కథ కూడా వినకుండా ఆ సినిమా చేయడానికి అతను ఒప్పుకున్నాడు. నేను కథ వినమని అడిగాను. కథ విన్నాక, ఆ రోల్‌కు తనను ఎందుకు ఎంచుకున్నారని అడిగాడు. ఆ రోల్‌కు మీరు సూటవుతారని చెప్పాను. అమీర్ సందేహిస్తూనే ఆ రోల్‌కు ప్రిపేర్ అయ్యాడు." అని తెలిపాడు వెట్రిమారన్.
Also Read