లాయర్ గా రవితేజ.. కాస్త డిఫరెంట్ గా!
on Jan 3, 2022

ప్రస్తుతం అగ్ర కథానాయకులు కోర్ట్ డ్రామాలపై ఫోకస్ పెడుతున్నారు. గత ఏడాది `వకీల్ సాబ్`లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `జై భీమ్`లో కోలీవుడ్ స్టార్ సూర్య.. లాయర్స్ గా అలరించారు. త్వరలో మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా న్యాయవాదిగా కనిపించబోతున్నారు. `పక్కా కమర్షియల్` పేరుతో రూపొందుతున్న ఈ మారుతి డైరెక్టోరియల్.. మార్చి 18న తెరపైకి రాబోతోంది.
ఇదిలా ఉంటే.. మాస్ మహారాజా రవితేజ కూడా త్వరలో ఓ సినిమా కోసం వకీల్ వేషంలో కనిపించబోతున్నారు. ఆ చిత్రమే.. `రావణాసుర`. `స్వామి రా రా` ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. సంక్రాంతికి సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఇందులో రవితేజ పోషిస్తున్న లాయర్ పాత్ర కాస్త డిఫరెంట్ గా ఉంటుందని టాక్. ఇంకా చెప్పాలంటే.. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఈ క్యారెక్టరైజేషన్ ఉంటుందని బజ్. త్వరలోనే దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ రానున్నది. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో `రావణాసుర` థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
మరోవైపు రవితేజ తాజా చిత్రం `ఖిలాడి` ఫిబ్రవరి 11న విడుదల కానుండగా.. `రామారావు ఆన్ డ్యూటీ` మార్చి 25న రిలీజ్ కాబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



