`లైగర్` కాంబో.. మరోసారి!
on Jan 3, 2022

పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `లైగర్` కోసం ఫస్ట్ టైమ్ జట్టుకట్టారు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ లో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో ఎంటర్టైన్ చేయనున్నాడు విజయ్. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ గ్లిమ్స్ తో సాలిడ్ పంచ్ కూడా ఇచ్చేసి.. సినిమాపై అంచనాలు పెంచేసింది `లైగర్` టీమ్. అంతేకాదు.. విజయ్ దేవరకొండ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన `అర్జున్ రెడ్డి` రిలీజ్ డేట్ ఆగస్టు 25ని టార్గెట్ చేసుకుని `లైగర్` థియేటర్స్ లోకి రాబోతోంది.
ఇదిలా ఉంటే.. `లైగర్` రిలీజ్ కాకముందే పూరి - విజయ్ మరో సినిమాకి ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే ఇరువురి మధ్య చర్చలు కూడా జరిగాయని ఇన్ సైడ్ టాక్. అంతేకాదు.. శివ నిర్వాణ కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ చేయనున్న సినిమా తరువాతే పూరి కాంబో మూవీ పట్టాలెక్కుతుందని అంటున్నారు. అలాగే, `లైగర్` తరహాలో ఇది కూడా పాన్ - ఇండియా మూవీగా ఉండబోతోందని సమాచారం. త్వరలోనే పూరి - విజయ్ సెకండ్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ రానున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



