'రామ్ గోపాల్ వర్మ' లాంటి మేధావి 'బాబా'గా మారితే?
on Jan 3, 2022

బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై షకలక శంకర్ టైటిల్ పాత్రలో బొమ్మకు మురళి నిర్మిస్తున్న చిత్రం 'ది బాస్'. 'నెవర్ డైస్' అన్నది ఉపశీర్షిక. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ వంటి ఓ అపర మేధావి బాబాగా మారితే అనే ఊహాజనిత కథాంశం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకి ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

'ది బాస్-నెవర్ డైస్' టైటిల్ లోగోను తాజాగా ప్రముఖ నటుడు సునీల్ విడుదల చేశారు. 'ది బాస్-నెవర్ డైస్' సమాజంలోని పలు రుగ్మతలను ప్రశ్నిస్తుందని.. రామ్ గోపాల్ వర్మను పోలిన వ్యక్తిగా షకలక శంకర్ అత్యద్భుతంగా చేసి ఉంటాడని సునీల్ పేర్కొన్నారు. తమ చిత్రం 'ది బాస్-నెవర్ డైస్' టైటిల్ లోగో ఆల్ రౌండర్ సునీల్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని మూవీ టీమ్ తెలిపింది. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొంది.
జబర్దస్త్ షోలో ఆర్జీవీని ఇమిటేట్ చేసి బాగా పాపులర్ అయిన షకలక శంకర్.. సినిమాల్లోకి వచ్చాక కూడా ఆర్జీవీ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఇప్పటికే సెటైరికల్ మూవీగా తెరకెక్కిన 'పరాన్నజీవి'లో ఆర్జీవీగా కనిపించిన షకలక శంకర్.. ఇప్పుడు 'ది బాస్'లోనూ ఆర్జీవీగా కనిపించనున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



