రవితేజ స్పీడుకు కారణం..వాళ్లతో రాజీపడటమేనా..?
on Feb 14, 2017
.jpg)
ఏడాదికి కనీసం రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించే రవితేజ బెంగాల్ టైగర్ తర్వాత ఒక సంవత్సరం పాటు సినిమాలకు దూరమయ్యాడు. రవి ఎందుకు సినిమాలు చేయడం లేదు..అసలు రవితేజకు ఏమైంది..? అనారోగ్యం కారణంగా యూరప్‌లో ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నాడా..? అంటూ రకరకాల ఊహాగానాలు మీడియాలో హల్‌చల్ చేశాయి.
కానీ ఇందుకు కారణాలు వేరే ఉన్నాయని..పారితోషికం విషయంలో రవితేజ వెనక్కు తగ్గకపోవడమే సినిమాలు తీయకపోవడానికి కారణమనే గుసగుసలు వినిపించాయి.అయితే వరల్డ్ టూర్‌ని ముగించుకుని వచ్చి రాగానే టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ సినిమాల ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనంతటికి కారణం మాస్ మహారాజా రెమ్యూనరేషన్ విషయంలో కాస్త వెనక్కి తగ్గడమేనట..దీంతో ఏడాది క్రితం రవితేజతో సినిమాలు చేయడానికి వెనుకాడిన నిర్మాతలే ఇప్పుడు ఆయన ఇంటి ముందు క్యూకడుతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



