సింగం సిరీస్‌కు స్పూర్తి మన తెలుగు పోలీస్ ఆఫీసరా..?
on Feb 15, 2017
.jpg)
సినిమా కథలు ఎక్కడి నుంచో పుట్టవు..మన జీవితంలో..చుట్టుపక్కల జరిగే సంఘటనలు, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల జీవిత చరిత్రలే వెండితెర మీద ఆవిష్కృతమవుతాయి..సూర్య, హరి కాంభినేషన్‌లో వచ్చిన సింగం సిరీస్ అన్ని పార్ట్‌లు సూపర్‌హిట్టే..సూర్య పవర్‌ఫుల్ యాక్టింగ్‌కు తోడు డైరెక్టర్ హరి స్క్రీన్‌ప్లే సింగం సిరీస్‌ని బ్లాక్‌బస్టర్స్ చేశాయి. ఈ సింగం కథలోని నరసింహం పాత్రకు కూడా ఒక పోలీస్ ఆఫీసరే స్పూర్తి..ఆ అధికారి ఎవరో కాదు తెలంగాణకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్.
.jpg)
ఈ విషయాన్ని స్వయంగా హీరో సూర్య తెలిపారు. సీవీ ఆనంద్ జీవితాన్ని బేస్ చేసుకుని నరసింహం పాత్ర రూపొందించడం జరిగిందట..22 ఏళ్ల వయసులోనే పోలీస్ శాఖలో ప్రవేశించి..ఆ శాఖలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి రాష్ట్రపతి పతకం పొందారు ఆనంద్. బ్యాంకాక్ పారిపోయిన కృషి బ్యాంక్ నిందితుల్ని ఎంతో చాకచక్యంగా పట్టుకుని ఇండియన్ పోలీస్ పవరేంటో చూపించి పోలీసులకు గర్వకారణంగా నిలిచారని సూర్య ప్రశంసించారు. అలాంటి వ్యక్తి పాత్రలో తాను నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సింగం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



