ఖైదీ నెం.150లో శ్రీకాంత్ అందుకే నటించలేదా..?
on Feb 14, 2017
శ్రీకాంత్...తెలుగు సినిమా చరిత్రలో 100 సినిమాలు చేసిన అతికొద్దిమంది హీరోల్లో ఒకడు..విలన్‌గా ఎంట్రీ ఇచ్చి లవర్‌బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఎప్పుడు నవ్వుతూ..నవ్విస్తూ అందరితో సన్నిహిత సంబంధాలు కలిగిఉంటారు. మెగాస్టార్ చిరంజీవిని అమితంగా ఇష్టపడే శ్రీకాంత్ ఆయననే ఆదర్శంగా తీసుకుని టాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చాడు. శంకర్‌దాదా ఎంబీబీఎస్, శంకర్‌దాదా జిందాబాద్ చిత్రాలలో తన ఫేవరేట్ హీరోతో కలిసి నటించాడు.
ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఆయనతో నటించే అవకాశం రాలేదు..అయితే తొమ్మిది సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ ఖైదీ నెం.150తో రీఎంట్రి ఇచ్చాడు. ఆ సినిమాలో ఒక పాత్ర చేయాల్సిందిగా దర్శకుడు వివి.వినాయక్ శ్రీకాంత్‌ని కోరాడట..కానీ సరైన పాత్ర కాకపోవడంతో శ్రీ ఆ ఆఫర్‌ను వదులుకున్నాడట..ఆ సినిమాలో నటించలేకపోయాననే బాధ తనను ఇంకా వేధిస్తోందని..అయితే ఖచ్చితంగా మళ్లీ ఏటిఎం లాంటి పాత్రలో అన్నయ్యతో కలిసి నటిస్తానన్నారు శ్రీకాంత్.