మాస్ క్రాకర్.. 'ధమాకా' సర్ ప్రైజ్ వచ్చేసింది!
on Oct 21, 2022
మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ధమాకా'. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి, 'జింతాక్ జింతాక్' సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ తో పాటు 'మాస్ క్రాకర్' పేరుతో సర్ ప్రైజ్ వచ్చింది.
దీపావళి కానుకగా కాస్త ముందుగానే 'ధమాకా' నుంచి సర్ ప్రైజ్ వచ్చింది. 'మాస్ క్రాకర్' పేరుతో తాజాగా టీజర్ ను విడుదల చేశారు. రవితేజ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ అని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. ఇటీవల 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలతో నిరాశపరిచిన రవితేజ.. ఈసారి తనదైన యాక్షన్ కామెడీ ఫిల్మ్ తో పక్కా ఎంటర్టైన్ చేసేలా ఉన్నాడు. త్రినాథ్ రావు సినిమాల్లో కామెడీకి పెద్ద పీట వేస్తాడు. 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్' వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మాస్ కి, కామెడీకి పెట్టింది పేరైన రవితేజతో చేస్తున్న 'ధమాకా'తో అంతకుమించిన వినోదాన్ని పంచుతాడేమో చూడాలి. అలాగే ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
