'జిన్నా' మూవీ.. ట్రోలర్స్ కి మంచు విష్ణు కౌంటర్!
on Oct 21, 2022
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం 'జిన్నా' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మొదటి షో నుంచి పర్లేదు అనే టాక్ తెచ్చుకుంటోంది. సినిమాలోని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాతో ట్రోలర్స్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు విష్ణు.
తనని, తన కుటుంబాన్ని కొందరు కావాలని ట్రోల్ చేస్తున్నారని పలు సందర్భాల్లో విష్ణు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే తన తాజా చిత్రం 'జిన్నా'లో ట్రోలర్లకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు విష్ణు. సినిమాలోని ఒక సన్నివేశంలో హీరోయిన్స్ పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ ని ఉద్దేశించి ఒక వ్యక్తి దారుణ వ్యాఖ్యలు చేస్తాడు. అప్పుడు విష్ణు ఆ వ్యక్తిని కొట్టి "నన్ను ట్రోల్ చేస్తే వదిలేస్తాను గానీ నా వాళ్ళ జోలికొస్తే ఊరుకోను" అంటూ డైలాగ్ చెప్తాడు. పరోక్షంగా ఈ డైలాగ్ బయట తనని, తన కుటుంబాన్ని ట్రోల్ చేస్తున్న వారికి కౌంటర్ అన్నట్టుగా ఉంది.
అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన 'జిన్నా'తో సూర్య దర్శకుడిగా పరిచయమయ్యాడు. కోన వెంకట్ స్క్రిప్ట్ అందించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె.నాయుడు వ్యవహరించారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
