రష్మిక బాలీవుడ్ కలలు?
on Apr 29, 2020

ఉన్నత స్థాయికి వెళ్లాలని ఎవరు మాత్రం కోరుకోరు? హీరోయిన్లు సైతం అందుకు అతీతం ఏమీ కాదు. ఒక ప్రాంత ప్రేక్షకుల చేత చప్పట్లు అందుకున్న తర్వాత దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఉన్న ప్రేక్షకుల చేత చప్పట్లు, ప్రశంసలు అందుకోవాలని ఆలోచిస్తుంటారు. కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో మంచి పేరు, అభిమానాన్ని సొంతం చేసుకొన్న రష్మిక, వీలైతే బాలీవుడ్ వెళ్లాలని ఆలోచిస్తున్నారా? ఈమధ్య అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసినప్పుడు... ఆమె చెప్పిన సమాధానాలు చూస్తే అవుననే అనిపిస్తోంది.
'మీకు హిందీ వచ్చా?' అని ప్రశ్నిస్తే... 'డౌట్ హై క్యా?' అని సమాధానం ఇచ్చారు. నాకు హిందీ రాదని మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. 'బాలీవుడ్ సినిమా చేసే ఆలోచనలు ఉన్నాయా?' అని అడిగితే... 'ఐ గెస్' అన్నారు. ఏమో గుర్రం ఎగరావచ్చు... రష్మిక బాలీవుడ్ వెళ్ళవచ్చు. అందులో సందేహాలు అవసరం లేదు. ప్రస్తుతం అజయ్ దేవగణ్ సరసన 'మైదాన్'లో ప్రియమణి, 'భుజ్'లో ప్రణీతా సుభాష్ చేస్తున్నారు. బాలీవుడ్ వెళుతున్న సౌతిండియన్ భామల లిస్టులో త్వరలో రష్మిక పేరు కూడా చేరుతుందేమో? చూద్దాం!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



