బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మృతి
on Apr 29, 2020

బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ఇకలేరు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పటల్‌లో బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ దర్శకుడు సుజీత్ సర్కార్ ఉదయం 11.36 గంటలకు ఈ సంగతి ట్వీట్ చేశారు. పెద్దపేగులో ఇన్ఫెక్షన్ ( colon infection) కారణంగా మంగళవారం ఇర్ఫాన్ ఖాన్ హాస్పిటల్ కి వెళ్లారు. ఎమర్జెన్సీ కావడంతో కొన్ని గంటలు అబ్జర్వేషన్‌లో ఉండాలని వైద్యులు చెప్పారట. ఆయన కోలుకుంటారని అభిమానులు ఆశించారు. ఈలోపు ఇటువంటి వార్త వినాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదు. గతేడాది న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ వ్యాధి బారినుండి ఆయన క్షేమంగా కోలుకున్నారు. మళ్లీ మరో వ్యాధి బారిన పడ్డారు. ఆ వ్యాధి చికిత్స తీసుకోవడం కోసం కొన్ని నెలలు విదేశాల్లో ఉన్నారు. ఇర్ఫాన్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది. గత శనివారమే ఇర్ఫాన్ తల్లి సయిదా మరణించారు. ఇప్పుడు ఆయన ఈ లోకం విడిచి వెళ్లారు. హిందీ సినిమాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఇర్ఫాన్, హాలీవుడ్ సినిమాలూ చేశారు. 'స్లమ్ డాగ్ మిలీనియర్', 'లైఫ్ ఆఫ్ పై', 'జురాసిక్ వరల్డ్', 'ద అమేజింగ్ స్పైడర్ మెన్' సినిమాల్లో ఆయన నటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



