ఇకపై కొడుకుల కోసమే నాగార్జున..!
on Apr 14, 2016
కుర్ర హీరోలు కూడా ఒక హిట్టు కొట్టడానికే నానా తిప్పలూ పడుతుంటే, కింగ్ నాగార్జున మాత్రం వరసగా మూడు హిట్లతో హ్యాట్రిక్ కొట్టేశారు. తన తండ్రి చూపించిన బాటలోనే, వైవిధ్యాన్ని, విభిన్న సినిమాల్నీ నమ్ముకుని విజయబాటలో పయనిస్తున్నారు నాగ్. ఆయన హ్యాట్రిక్ హిట్ సినిమా ఊపిరి. ఈ సినిమా కమర్షియల్ గానే కాక, మానసికంగా కూడా నాగ్ కు బాగా దగ్గరైంది. ఇప్పటికీ చాలా చోట్ల సక్సెస్ ఫుల్ గా ఆడుతున్న ఈ సినిమా సక్సెస్ ను పునస్కరించుకుని, థ్యాంక్స్ గివింగ్ మీట్ ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఆ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ, తనకు హ్యాట్రిక్ హిట్స్ ను అందించిన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ఒక ఇంట్రస్టింగ్ వ్యాఖ్య చేశారు. తర్వాత రాఘవేంద్రరావుతో హాథీరాం బాబా సినిమాను మొదలెట్టబోతున్నాను. నాతో సోగ్గాడు తీసిన కళ్యాణ్ కృష్ణతో చైతూ మూవీ, వంశీ డైరెక్షన్లో అఖిల్ మూవీ ఫైనల్ చేద్దామనుకుంటున్నాం. ఇప్పటి వరకూ వాళ్ల కెరీర్ల మీద మనసు పెట్టలేదు. ఈ ఏడాది మాత్రం అదే పనిలో ఉండాలనుకుంటున్నాను. ఇది అభిమానులకు నా ప్రామిస్ అంటూ నాగార్జున మాట్లాడారు. దీంతో నాగార్జున తన ఎక్స్ పీరియన్స్ తో కొడుకుల కోసం మూవీలు సెలక్ట్ చేస్తే, వాళ్ల కెరీర్లు గాడిలో పడటం కన్ఫామ్ అంటూ హ్యాపీ అవుతున్నారు అక్కినేని ఫ్యాన్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
