బాధతో విలవిల్లాడిపోయిన బాలీవుడ్ హీరో..!
on Apr 19, 2016

సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్లే నటులు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటివాళ్లలో రణ్ దీప్ హుడా పేరు కూడా తప్పక ఉంటుంది. సరబ్ జిత్ సినిమా కోసం తనను తాను పూర్తిగా మార్చుకుని, కడుపు మాడ్చుకుని బక్కచిక్కి శల్యమైపోయిన రణ్ దీప్, ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా కోసం మళ్లీ బరువు పెరిగాడు. కానీ సరబ్ జిత్ కోసం అతను చేసిన డైటింగ్ తాలూకు ప్రభావం మాత్రం అతన్ని వదల్లేదు. ఆదివారం సుల్తాన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్లోనే తీవ్రమైన నొప్పితో కుప్పకూలిపోయాడు రణ్ దీప్. వెంటనే హాస్పిటల్ కు తరలించిన తర్వాత ఆయనకు ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్లో అప్పెండిసైటిస్ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ ముగిసిన వెంటనే రణ్ దీప్ ను డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెబుతున్నారు. రెజ్లింగ్ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాలో రణ్ దీప్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇది కాక హుడా టైటిల్ రోల్ పోషించిన సరబ్ జిత్ విడుదలకు సిద్ధంగా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



