సోషల్ మీడియాలో తమన్నా పెళ్లి వార్త..?
on Apr 19, 2016

తమన్నా..పాల కన్నా తెల్లనైన మేనిఛాయతో మెరిసే పాలరాతి శిల్పం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా ఆపర్ల మీద ఆఫర్లుతో దూసుకుపోతోంది. అయితే సడన్‌గా తమన్నా పెళ్లి రూమర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఒక నేషనల్ మీడియా పబ్లిష్ చేసిన కథనం ప్రకారం..హిందీలో రణవీర్ సింగ్ సరసన చేసే సినిమాయే తమన్నా ఆఖరి సినిమా అంట. ఆ తర్వాత తమ్మూ యాక్టింగ్ నుంచి రిటైర్ అవుతుందట.
గత రెండేళ్లుగా..ముంబయికి చెందిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరితో మిల్కీబ్యూటి ప్రేమాయణం నడిపుతోందట. అతగాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడట. ఇప్పటికే ప్రేమలో పీకల్లోతు మునిగిపోయిన ఈ జంట ప్రేమను పెళ్లిగా మార్చాలనుకుంటుందట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను ఫినిష్ చేసుకుని..ఇక కొత్త సినిమాలను అమ్మడు ఒప్పుకోదట. పెళ్లయ్యాక సినిమాలు మానేసి తాను స్థాపించిన గోల్డ్ డిజైన్ అండ్ గోల్డ్ బిజినెస్ చూసుకుంటుందట అమ్మడు. మరి ఈ రూమర్లలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కాని ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



