ఆ మెగా హీరోలకు బోన్స్ లేవట..!
on Apr 19, 2016

కుర్రహీరోలందరి సరసనా నటిస్తూ, స్టార్ హీరోయిన్ స్టేటస్ కొట్టేసింది రకుల్ ప్రీత్ సింగ్. మెగా హీరోలకు కూడా రకుల్ ఫేవరెట్ అయిపోయింది. ఇప్పటికే చరణ్ బ్రూస్ లీ సినిమాలో అలరించిన రకుల్, తనీ ఒరువన్ రీమేక్ లో కూడా కనిపించబోతోంది. తాజాగా అల్లు అర్జున్ సరైనోడులో బన్నీ తో చిందేసింది. ఆ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న రకుల్, తన డ్యాన్స్ సినిమా సినిమాకూ ఇంప్రూవ్ అవుతోందని చెబుతోంది. అందుక్కారణం, రీసెంట్ గా తాను వర్క్ చేసిన హీరోలేనట. బ్రూస్ లీలో రామ్ చరణ్, నాన్నకు ప్రేమతో లో ఎన్టీఆర్, సరైనోడులో అల్లు అర్జున్..ఇలా అందరూ అద్భుతైమైన డ్యాన్సర్లతో వర్క్ చేయడం వలన తన డ్యాన్స్ కూడా ఇంప్రూవ్ అవుతోందట. మెగా హీరోలు చరణ్, బన్నీలకైతే అసలు ఎముకలే లేవు అన్నంతగా డ్యాన్స్ చేస్తారని కితాబిస్తోందీ భామ. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో మొదలైన రకుల్ టాలీవుడ్ ప్రయాణం, హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరస ఆఫర్లతో బిజీ బిజీగా సాగుతోంది. అల్లు అర్జున్ తో రకుల్ నటించిన సరైనోడు 22 న థియేటర్లలో సందడి చేయబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



