‘అన్‌స్టాపబుల్’ షోలో రామ్‌చరణ్.. ఆ డ్రెస్ రేట్ వింటే షాకే!
on Jan 1, 2025
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ పాల్గొన్న ఈ షో ప్రేక్షకుల్ని విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తోంది. తాజాగా సీజన్ 4లో రామ్‌చరణ్ పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ షూటింగ్‌ను డిసెంబర్ 31న చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చరణ్‌తోపాటు శర్వానంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్ ఎంతో సందడిగా జరిగిందని ఆహా యూనిట్ తెలియజేస్తోంది. సరదా మాటలు, సెటైర్లు, ఆట పాటలు... ఇలా ఎంతో ఫన్నీగా ఎపిసోడ్ ఉంటుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. షోకి సంబంధించిన విషయాల కంటే చరణ్ వేసుకున్న హుడీ గురించి సోషల్ మీడియాలో చర్చ స్టార్ట్ అయింది. గూగుల్ బాగా అందుబాటులోకి రావడంతో తమ హీరోలు ఏదైనా కొత్త డ్రెస్, వాచ్, గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు వెంటనే దాని రేట్ ఎంత అనేది గూగుల్ చేస్తున్నారు. ఆ రేటు చూసి హీరోల అభిమానులు కాలర్ ఎగరేస్తుంటారు. తాజాగా అన్‌స్టాపబుల్ షోలో చరణ్ వేసుకున్న హుడీ ధరను కూడా కనిపెట్టేసారు. దాని ధర రూ.1.35 లక్షలు. ఆఫర్ రేటు రూ.88,000 ఉంది. దీంతో తమ హీరో వేసుకున్న డ్రెస్‌ని, దాని రేటును వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇక రామ్‌చరణ్ కొత్త సినిమా గేమ్ ఛేంజర్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.
Also Read