రామ్‌చరణ్ న్యూ ఇయర్ గిఫ్ట్ మరో 24 గంటల్లో...!
on Jan 1, 2025
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ చిత్రం రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతోంది. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే అందరూ ఎదురు చూస్తున్న ట్రైలర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చెయ్యబోతున్నారు. నూతన సంవత్సర కానుకగా జనవరి 2 సాయంత్రం గం.5.04లకు రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ సినిమాలోని అప్పన్న క్యారెక్టర్‌తో కూడిన పోస్టర్‌ని రిలీజ్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఈవారంలోనే ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజమండ్రిలో భారీ ఎత్తున జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గేమ్ ఛేంజర్‌కి టికెట్ల రేట్లను పెంచుకునే సదుపాయంతోపాటు, బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో గేమ్ ఛేంజర్ చిత్రానికి ఓపెనింగ్స్ ఎలా వస్తాయి, ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుంది అనేది తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read