సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న స్టార్ హీరో!
on Jan 1, 2025
తమిళ్ స్టార్ హీరో అజిత్‌కి తమిళ్‌లోనే కాదు, తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. గత 30 సంవత్సరాలు అజిత్ చేసిన ఎన్నో సినిమాలు తెలుగులోనూ ఘనవిజయం సాధించాయి. తాజాగా అజిత్ చేస్తున్న విదాముయర్చి చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అజిత్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించగా, అర్జున్, రెజీనా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
సంక్రాంతికి అజిత్ సినిమా వస్తోందని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అనుకోని కారణాల వల్ల సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నామని మేకర్స్ ప్రకటించారు. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెబుతున్నారు. అయితే ఏ డేట్‌కి రిలీజ్ చేస్తారనేది మాత్రం మేకర్స్ చెప్పలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెలాఖరుకు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే సంక్రాంతికి అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా సంక్రాంతికి అజిత్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read