షారూఖ్ "ఫ్యాన్" ఫస్ట్ డే కలెక్షన్స్..!
on Apr 16, 2016
బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన లేటేస్ట్ మూవీ "ఫ్యాన్" నిన్న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. నిన్నటి నుంచి ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో సూపర్ స్పీడ్‌గా దూసుకుపోతోంది. ఈ సినిమాలో షారూఖ్ ద్విపాత్రాభినయం చేశాడు. అభిమానులు కోరుకున్న అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో ఈ సినిమా బాక్షాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ డే దేశవ్యాప్తంగా 19.20 కోట్లు వసూలు చేసింది. శని, ఆదివారాలు కావడంతో మొదటి రోజు లాగే అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ మరోసారి రీపిట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుండటంతో ఎలా లేదన్నా 50 కోట్లు ఈజీగా క్రాస్ చేసే అవకాశం ఉంది.