కాటమరాయుడులో లీకైన సీన్ ఇదే
on Feb 28, 2017
ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా..దర్శకులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా పైరసీ రక్కసి చిత్ర పరిశ్రమను వదలడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారంతో పాటు సినిమాలోని కీలక సన్నివేశాలు కూడా ఇంకా షూటింగ్ స్టేజ్‌లోనే ఉండగానే ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నాయి. తాజాగా డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడులో కీలకమైన యాక్షన్ సీన్ ఒకటి ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది.
ఇది సినిమాను మలుపుతిప్పే యాక్షన్ సీన్ అన్న ప్రచారం జరుగుతోంది. పవన్ రక్తంతో తడిసిన బట్టలతో మోకాళ్లపై కూర్చొని ఉండగా విలన్ అతని అనుచరులు పవర్‌స్టార్‌ను ఐరన్ రాడ్‌తో కొడుతున్న సన్నివేశం నెట్‌లో హల్ చల్ చేస్తోంది. అదే సమయంలో క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. విషయం తెలుసుకున్న చిత్రయూనిట్ ఆగమేఘాల మీద సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. ఇంతకి ఈ వీడియోని నెట్‌లో పెట్టేంది ఎవరా అని ఆరా తీస్తున్నారు. అయితే ఎక్కువగా డబ్బింగ్, ఎడిటింగ్ స్టూడియోల నుంచి ఈ లీకులు జరుగుతుంటాయి.
Also Read