ముంబైలో గృహప్రవేశం చేసిన చరణ్-ఉపాసన!
on Jul 3, 2021
.jpg)
టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోల్లో రామ్‌చరణ్ ఒకరు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పాష్ ఏరియాల్లో ఒకటైన జూబ్లీ హిల్స్‌లో అత్యంత విలాసవంతమైన ప్రాపర్టీ కలిగివున్న రామ్‌చరణ్ కొంత కాలం క్రితం ముంబైలో ఓ ఖరీదైన ప్లాట్‌ను కొనుగోలు చేశారు. లేటెస్ట్‌గా ఆ స్థలంలో ఓ విలాసవంతమైన భవంతిని నిర్మించారు. ఇటీవల భార్య ఉపాసనతో కలిసి గృహప్రవేశం కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఇద్దరి సన్నిహిత స్నేహితులు మాత్రమే హాజరయ్యారంటున్నారు.
జూబ్లీ హిల్స్‌లో ఆయన ఆస్తుల విలువ రూ. 38 కోట్లని అంచనా. హైదరాబాద్, ముంబైతో పాటు దేశంలోని మరికొన్ని ఏరియాల్లోనూ చరణ్‌కు ఆస్తులు ఉన్నాయి. తన సమకాలీన హీరోల్లో ముంబైలో విలాసవంతమైన భవంతి కలిగిన తొలి హీరో చరణ్. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఆదాయం పొందుతున్న చరణ్ వాటిలో పెద్ద మొత్తాన్ని వివిధ వ్యాపారాల్లో ఇన్‌వెస్ట్ చేస్తున్నాడు. ప్రధానంగా రియల్ ఎస్టేట్‌లో పెడుతున్నట్లు తెలుస్తోంది.
చరణ్ ప్రస్తుతం రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్'లో తన సీన్స్ అన్నింటినీ పూర్తిచేయడమే కాకుండా, తన క్యారెక్టర్‌కు డబ్బింగ్ కూడా చెప్పేశాడు. పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమాకు అత్యంత క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. త్వరలో శంకర్ డైరెక్షన్‌లో మరో పాన్ ఇండియా సినిమా చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



