ధనుష్ ని కలిసిన శేఖర్ కమ్ముల
on Jul 3, 2021

టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై నారాయణదాస్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో తెరకెక్కించనున్నారు. అయితే తాజాగా దర్శక నిర్మాతలు ధనుష్ ని కలిశారు.
ప్రస్తుతం ధనుష్ ఓ తమిళ చిత్రం షూటింగ్ లో భాగంగా హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ క్రమంలో హీరో ధనుష్ ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నిర్మాతలు నారాయణ్ దాస్, పి. రామ్మోహన్ రావు కలిశారు. ఈ సందర్భంగా ధనుష్ తో దర్శక నిర్మాతలు కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్ స్టొరీ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో హీరో హీరోయిన్లుగా నాగ చైతన్య, సాయి పల్లవి నటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



